![]() |
![]() |
.webp)
రాబోయే హోలీ రంగుల పండగను పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా బయట హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో వాళ్ళ సందడి వీడియోని టెలికాస్ట్ చేశారు. ఇందులో "ఆది గుల షాప్" అంటూ నటీ నరేష్ ఒక బ్యానర్ ని తీసుకొచ్చాడు. అది చూసి అదేంటిరా "రం" ఏది అని అడిగేసరికి "నాన్నగారు తాగేశారు" అని చెప్పాడు. ఈ ఎపిసోడ్ సౌమ్య వచ్చి డాన్స్ చేసింది. ఐతే సౌమ్య వేసిన డాన్స్ స్టెప్స్ అన్నీ తనవే అని వాటిని కాపీ కొట్టేసింది అంటూ ఆది ఫైర్ అయ్యాడు. దానికి హోస్ట్ రష్మీ ఐతే ఆ స్టెప్స్ వేసి చూపించండి అంటూ ఆదిని అడిగింది.
ఆది ఏదో వచ్చి రాని స్టెప్పులేశాడు. ఇక నరేష్ వచ్చి "ఒక్క స్టెప్ కె కేసు ఎలా వేస్తారండి" అంటూ కౌంటర్ వేసాడు. "వేస్తాం రా మేము మేమంతే కూర్చో" అంటూ ఆది రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సౌమ్య ఐతే "పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు అయ్యింది. కానీ ఎం చేయలేదు ఇంతవరకు " అంటూ ఆదిని నిలదీసింది. తర్వాత నాటీ నరేష్ వచ్చి ఆది బండారం బట్టబయలు చేసాడు. కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఫోటోని ప్లే చేసాడు. ఆది ఆ ఫోటోని ముందు షాక్ అయ్యాడు. కానీ వేంటనే ఇది తనకు బాగా నచ్చిందని ఇలాంటివే ప్లాన్ చేయాలనీ కూడా ఒక సలహా ఇచ్చాడు. తర్వాత కొంతమంది అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసాడు ఆది. ఇక లాస్ట్ లో సౌమ్య ఒక కాఫీ మగ్ తెచ్చింది దాని మీది తన తల్లితో కలిసి తీయించుకున్న ఫోటోని పెట్టుకుంది. తాను అమ్మ కాదు నా బిడ్డ..అమ్మ బాగున్నప్పుడు మంచి ఫొటోస్ లేవు..ఎందుకంటే మంచి మొబైల్స్ లేవు..అమ్మ బెడ్ రిడెన్ అయ్యాక నా దగ్గర మంచి మొబైల్ ఉంది..కానీ అమ్మతో మంచి ఫొటోస్ లేవు అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది సౌమ్య .
![]() |
![]() |